People | సర్పంచ్‌లూ.. అభినందనలు

People | సర్పంచ్‌లూ.. అభినందనలు
- ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలి
- అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి
- రాష్ట్ర పశుసంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
People | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఆదరించి గెలిపించిన ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర పాడి పశుసంవర్ధక క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో జరిగే అభివృద్ధిలో సర్పంచులకు గురుతర బాధ్యత ఉంటుందన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రెండేళ్లలో మక్తల్ నియోజకవర్గంలో రూ.1035 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మనెమ్మ గోపాల్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్, పట్టణ అధ్యక్షులు కొక్కు లింగం, తదితరులు పాల్గొన్నారు.
