Delhi High Court | మహువా మొయిత్రాకు ఊరట..

Delhi High Court | మహువా మొయిత్రాకు ఊరట..
Delhi High Court | ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో తాత్కాలిక ఊరట లభించింది. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల కేసులో సీబీఐ (CBI) అభియోగపత్రం దాఖలు చేయాలని లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. కేసును మరోసారి పునఃసమీక్షించాలని లోక్‌పాల్‌కు హైకోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది.
