Mahatma Gandhi | బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి

Mahatma Gandhi | బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి

  • టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

Mahatma Gandhi | నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పేదల కడుపులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ(Mahatma Gandhi) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ…. రైతు వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు ఉన్న ఊళ్లోనే పని కల్పించే గొప్ప పథకం ఉపాధి జాతీయ హామీ పథకమని, దీనిని యూపీఏ ప్రభుత్వం(UPA government)లో ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి వలసల నివారణకు ప్రతి మనిషికి పని కల్పించే ఉద్దేశంతో చేసిన గొప్ప చట్టమన్నారు. పేదల కడుపు కొట్టేందుకు కేంద్రం ఈ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర పన్నుతుందన్నారు. ముందుగా పథకం పేరు మార్చడం, తరువాత రాష్ట్రాలకు ఈ పథకం బాధ్యతను అప్పగించి క్రమేణా కేంద్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.

ఈ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్రం చర్యలను వివరించి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి(state level) వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నామన్నారు. పేదలు బీజేపీ కుట్రలను గుర్తించి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు వంకేశ్వరం మన్నెమ్మ, కాంగ్రెస్ నాయకులు కోటయ్య బండ పర్వతాలు హబీబ్ వంకేశ్వరం నిరంజన్, ధర్మరాజు బంగారి పర్వతాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply