ఆన్లైన్లో అందుబాటులో అమ్మ సేవలు..

  • సులభతరంగా, సమర్థవంతంగా..
  • పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు..
  • సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తూ…
  • సమర్థవంతంగా దీక్షల విరమణ..
  • అందరి సహకారంతో విజయవంతం…
  • దుర్గగుడి ఈవో శీనా నాయక్.. చైర్మన్ బొర్రా గాంధీ..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కనకదుర్గ అమ్మవారి సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు అందరికీ అందుబాటులో తెచ్చే క్రమంలో ఆన్లైన్లో అమ్మవారి సేవలు అన్నింటిని ఉంచినట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ)లు తెలిపారు.

సామాన్యులకే తొలి ప్రాధాన్యత ఇస్తూ సులభంగా సమర్థవంతంగా పారదర్శకంగా వేగవంతంగా అమ్మవారి సేవలు లభిస్తాయన్నారు. అన్ని శాఖల అధికారులతో పటిష్ట ప్రణాళికతో దీక్ష విరమణ ఉత్సవాలను విజయవంతం చేసామన్న వారు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

విలేకరుల సమావేశంలో ఈవో చైర్మన్ లు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధితోపాటు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా దేవాలయాల్లో భక్తులకు పారదర్శకమైన వేగవంతమైన సేవలు అందించడానికి ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలపకుండా టెక్నాలజీని ఉపయోగించుకుని దర్శన ప్రక్రియను మరింత సులభతరం చేయడమే తమ ప్రధాన లక్షమని తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా ఇంద్రకీలాద్రి కి వచ్చే లక్షలాదిమంది భక్తులకు క్యూలైన్లో వేచి ఉండే అవకాశం తగ్గి మెరుగైన సేవా అనుభవం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవాని దీక్షల విరమణకు ప్రత్యేక యాప్ ను వినియోగించామన్నవారు యాప్ ద్వారా భక్తులకు దేవస్థానం పూర్తి సమాచారం క్షణాల్లో అందించగలిగామన్నారు. ఐదు రోజులపాటు భవాని దీక్షల విరమణ ఉత్సవాలు దిగ్విజయంగా శాంతియుత వాతావరణంలో ముగిశాయని ఈ యాడాది రికార్డు స్థాయిలో సుమారు 6 లక్షలకు పైగా భక్తులు తమ దీక్షణ విరమించుకున్నట్లుగా తెలిపారు.

భవిష్యత్తులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దర్శనం బుకింగ్స్ ప్రసాదం కొనుగోలు పార్కింగ్ వివరాలు వంటి సేవలను యాప్ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేవాలయ అభివృద్ధికి భక్తుల అందించే విరాల ప్రక్రియను మరింత సులభతరం పారదర్శకంగా మార్చే మన వాళ్లు భక్తులు తమ విరాళాలను సురక్షితంగా నేరుగా దేవస్థానానికి అందజేయడానికి వివిధ ఆన్లైన్ పద్ధతులు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంచామన్నారు.

దేవస్థానానికి కంప్యూటర్లు ఇతర సామాగ్రి బహుకరణ..

దుర్గగుడి ఆలయంలో ఆన్లైన్ సేవల నిర్వహణ కోసం అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లు యుపిఎస్ వంటి పరికరాలను దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ స్నేహితులు ఆలయానికి విరాళంగా అందజేశారు. సుమారు రూ 10,13,000/- విలువైన కంప్యూటర్లు ప్రింటర్లు ఇతర పరికరాలను దాతలు ఈవో చైర్మన్ లకు అందజేశారు.

విజయవాడ నగరానికి చెందిన లక్ష్మీ నరసయ్య చౌదరి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి సేవలు ఆధునికరణ కోసం వీటిని బహూకరించారు. ఆలయానికి విరాళ మందచేసిన వీరికి చైర్మన్ ఈవోలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply