Must Wear | హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత!

Must Wear| హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత!

  • ప్రయాణంలో తప్పనిసరిగా ధరించాలి
  • ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
  • విద్యార్థులతో కలిసి చైతన్య కార్యక్రమం
  • వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు

Must Wear| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అన్నింటికంటే జీవితం ఎంతో విలువైనది. సాటిలేని మేటి జీవితాన్ని కాపాడుకునేందుకు రహదారి ప్రమాదాల సమయంలో మనల్ని మనం రక్షించుకునేందుకు హెల్మెట్‌(Helmet)ను బరువుగా కాకుండా.. బాధ్యతగా వినియోగించాలంటూ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Must Wear
Must Wear

Must Wear
Must Wear

ప్రయాణ సమయంలో వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలంటూ ముఖ్య కూడళ్ల‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థులతో కలిసి వాహనదారులకు చైతన్యం కలిగించేందుకు ర్యాలీల(rallies)ను నిర్వహిస్తున్నారు.

Must Wear | స్థానిక నలంద, సిద్ధార్థ ఫార్మసీ విద్యార్థులతో కలిసి

రహదారి ప్రమాదంలో రక్షణ కవచంగా ఉండే హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలంటూ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు బుధవారం బెంజ్ సర్కిల్(Benz circle) వద్ద విద్యార్థులతో కలిసి అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ రవికుమార్ సారథ్యంలో స్థానిక నలంద, సిద్ధార్థ ఫార్మసీ విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు.

ట్రాఫిక్ పద్ధతులు పాటించాలి… తప్పనిసరిగా హెల్మెట్‌ను వినియోగించాలి అంటూ ప్లే కార్డుల(playing cards)ను ప్రదర్శించారు. బెంజ్ సర్కిల్ వద్ద రాకపోకలు నిర్వహిస్తున్న వాహనదారులతో మాట్లాడుతూ వారికి అవగాహన కల్పించారు. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా నిర్వహిస్తున్న ఈ ట్రాఫిక్ కార్యక్రమాలు వాహనదారుల్లో చైతన్యాన్ని నింపనుంది.

Must Wear
Must Wear

CLICK HERE TO READ

Leave a Reply