MLA | కుటుంబ సమేతంగా..

MLA | కుటుంబ సమేతంగా..
- అమీనాబాద్‌లో ఓటేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
MLA | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని అమీనాబాద్ గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhav Reddy) బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12గంటల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి గ్రామంలోని ఎనిమిదో వార్డులో ఓటు వేశారు. ఎమ్మెల్యే దొంతి తనయుడు అవియుక్త్ రెడ్డి తొలిసారిగా ఓటు హక్కు(right to vote) వినియోగించుకున్నారు.
