Candidates | కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీ..

Candidates | కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీ..

  • పెద్ద తండాలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోరు..

Candidates | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నెల్లికుదురు మండలంలోని మొత్తం 31 గ్రామపంచాయతీల్లో సగం పంచాయతీలకు పైగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు హారహోరీగా తలపడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లు ప్రచారాలు కొనసాగించారు. ముఖ్యంగా మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణ కొత్తపల్లి, నైనాల, రామన్నగూడెం, ఆలేరు, శ్రీరామగిరి, కాస్య తండా, మెచరాజు పల్లి, హేమ్లా తండా గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముఖాముఖి తలపడుతుండగా ఎర్రబెల్లిగూడెం గ్రామంలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ ల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థి ఉండటంతో త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఇక పెద్ద తండాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొని వుంది. కాచికల్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది.

Leave a Reply