INTUC | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

INTUC | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

INTUC | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జేజేలు తెలిపారు.

అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత మాట్లాడుతూ… ఈ దశాబ్దాల కల నెరవేర్చిన తెలంగాణ(Telangana) ప్రజల దేవతగా నిలిచారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల సోనియా గాంధీ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలన్నారు.

ఈ దేశం కోసం బలిదానం చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని నిలబెట్టిన నిజమైన దేశ భక్తురాలు సోనియా గాంధీ అని, అలాంటి తల్లిని దేశ ప్రజలే తన జీవితమని దేశం(Country) కోసం జీవిస్తున్న రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణమన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదన్నారు.

సన్న బియ్యం, రేషన్ కార్డులు(ration cards), ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇందిరమ్మ చీరలు, సంక్షేమ పథకాలు అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ 2029లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి సీనియర్ నాయకులు కిన్నెర శీను, ఐఎన్టీయూసీ అంబటి సోమన్న, జేల్లా వెంకటేశ్వర్లు కుకుడాల ఆంజనేయులు, ఎండి ముంతాజ్ అలీ, చింతమల వెంకటయ్య, రమణయ్య, కన్నారావు, శివ గౌడ్, పరమేష్, శివ, మధు చౌదరి, NSUI యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఐఎన్టీయూసీ, మైనార్టీ సెల్, INTUC లీడర్స్ తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.