Nomination | అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..

Nomination | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనవేణ సృజన రమేష్ నామినేషన్ వేసారు. సృజన రమేష్ మాట్లాడుతూ.. ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే.. దోచుకుంటారు. ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తారు. గ్రామాభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే.. అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని, అన్ని రంగాల, వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తాను అన్నారు.

కుల, మత, జాతి విభేదాలు లేకుండా అందరిని సమాన దృక్పథంతో చూస్తాను.. సమాజ సేవ చేయడం కోసం ముందుకు వచ్చాను. మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తాను. రాజకీయంగా, ఆర్థికంగా, సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply