Mahashivratri | బ్ర‌హ్మోత్సవాలకు స‌ర్వం సిద్ధం చేయాలి

Mahashivratri | బ్ర‌హ్మోత్సవాలకు స‌ర్వం సిద్ధం చేయాలి

  • శ్రీశైలంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • ఏర్పాట్లపై అధికారులతో ప్రాథమిక సమావేశం

Mahashivratri | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని (Srisailam) భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఈ రోజు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పండుగ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే ఈ 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారియం. శ్రీనివాసరావు, దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు, మరియు వైదికకమిటీతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో ముందుగా గత సంవత్సరపు మహాశివరాత్రి (Mahashivratri) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లాయంత్రాంగం, ధర్మకర్తల మండలి సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్దవహించాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు.