Sarpanch | ప్రచారంలో దూసుకెళ్తున్న‌ బొమ్మెర రమ అశోక్

Sarpanch | ప్రచారంలో దూసుకెళ్తున్న‌ బొమ్మెర రమ అశోక్


Sarpanch | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్దిగా ఆగ్రామ తాజా మాజీ సర్పంచ్ బొమ్మెర అశోక్ సతీమణి బొమ్మెర రమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం గ్రామంలోని తన వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త అశోక్ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే (MLA) భూక్యా మురళి నాయక్ తనను కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్దిగా ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే మురళీనాయక్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తామ‌న్నారు.

Leave a Reply