Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం

Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం

  • ఎస్ ఆర్ బీ మెంబర్ రాధా

Railway Board | శావల్యాపురం, ఆంధ్రప్రభ : శావల్యాపురం జంక్షన్ లో ప్రతి రైలు ఆపాల‌ని, ఆపించేలా చర్యలు తీసుకుంటామని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్(South Central Railway Board) మెంబర్ కొంకేరు రాధా తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాల మేరకు శావల్యాపురం రైల్వే స్టేషన్ను ఈ రోజు రైల్వే బోర్డ్ మెంబర్ కొంకేరు రాధా సందర్శించారు.

స్థానిక తెలుగుదేశం నాయకులు, రైతు సంఘ నాయకులు రైల్వే బోర్డ్ మెంబర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. కరోనాకు ముందు అన్ని రైళ్లు ఇక్కడ ఆగేవని కరోనా తర్వాత రైళ్లు ఏవి సరిగ్గా ఆగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేరుకే జంక్షన్ అని రైళ్లను సరిగ్గా నిలుపుదల చేయడం లేదన్నారు.

ముఖ్యంగా తిరుపతి రైలును యధావిధిగా శావల్యాపురం స్టాప్(Savalyapuram Stop) ఇవ్వాలని విన్నవించారు. దీనిపై స్పందించిన బోర్డ్ మెంబర్ కొంకేరు రాధా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలను రైల్వే ఎండీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి బత్తుల వెంకటేశ్వర్లు(Bathula Venkateshwarlu), మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లా పేరయ్య, రైతు సంఘం నాయకులు కెవిఆర్.మోహన్ చంద్, స్థానిక నాయకులు చౌదరి, నల్లమాటి వెంకటేష్, ఆలూరి చంద్రబాబు, చెరుకూరి బాలకృష్ణ, మహిళలు తదితర రైతులు పాల్గొన్నారు.