Peddavangara | నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
Peddavangara | నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
Peddavangara | పెద్దవంగర, ఆంధ్రప్రభ : రెండో విడత ఎన్నికల్లో భాగంగా పెద్దవంగర (Peddavangara) మండలంలోని 9 క్లస్టర్లలో 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు ఆదివారం నుండి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పెద్దవంగర మండల ఎంపీడీవో వేణుమాధవ్ (MPDO Venumadhav) తెలిపారు. ఈనెల 30న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.
డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు (Nominations) స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత చెల్లుబాటులో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.డిసెంబర్ 6 న నామినేషన్ల ఉపసంహరణ మధ్యాహ్నం 3గంటల వరకు ఉంటుంది. అదే రోజున మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలై అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు.
ఆదివారం నుండి ప్రారంభమవుతున్న రెండో విడత ఎన్నికల (second phase of elections) నామినేషన్ పత్రాలు స్వీకరణకు నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని,నామినేషన్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని సంబంధిత క్లస్టర్లకు పంపినట్లు ఎంపీడీవో వేణుమాధవ్ పేర్కొన్నారు.
