Ditya Storm | దూసుకొస్తున్న దిత్వా తుపాను..

Ditya Storm | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా దిత్యా తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను వల్ల నష్టం జరగకుండా ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇన్ ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని ఆదేశలు జారి చేశారు.
ఈ మేరకు నంద్యాల జిల్లాలో దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా స్థాయి అధికారులను వీసీ వీసీ ద్వారా శనివారం ఆదేశించారు. ఈ రోజు ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి పంటల కోత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే కోత కోసిన పంటను తార్పాలిన్ షీట్లు వేసి రక్షించుకోవడం, వర్షాకాలంలో తేమకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంట దిగుబడిని ఆరుబయట కాకుండా, తప్పనిసరిగా గోడౌన్లలో లేదా భద్రమైన గదుల్లో నిల్వ చేసుకోవాలన్నారు. వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ తీగలు, చెట్లు, నీటితో నిండిన రహదారులు వద్ద జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే సమీప గ్రామ వాలంటీర్లను, సంబంధిత తహసీల్దార్ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయం అందించేలా సిద్ధంగా ఉందని తెలిపారు.
