AP | స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ

AP | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామంలో స్వచ్ఛ రథం గురువారం పర్యటించి.. గ్రామస్తులకు నిత్యావసర వస్తువులను అందజేసింది. గ్రామస్తులు ఇంటింటా పేరుకుపోయే పనికిరాని ప్లాస్టిక్, ఇనుము, పేపర్ స్క్రాప్ వంటి వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందించారు. ఇలా చేయడం వల్ల గ్రామం శుభ్రంగా ఉండడమే కాకుండా అందించిన స్క్రాప్ కు బదులుగా నిత్యవసర సరుకులు పొందవచ్చని అధికారులు తెలిపారు.