Krishna | విద్యార్థితో కలిసి హోంగార్డు అసభ్య నృత్యాలు..
Krishna | విద్యార్థితో కలిసి హోంగార్డు అసభ్య నృత్యాలు..
Krishna | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థినితో కలిసి అసభ్యంగా నృత్యాలు చేసిన హోంగార్డును తప్పిస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డ్ 304 బి.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో సదరు హోంగార్డ్ (Home Guard) పై క్రమ శిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మంగళవారం ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గోని,, హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాగా, వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వీడియోల ద్వారా ప్రచురితమవుతున్న వార్త నిజ నిర్ధారణ కావడంతో మంగళవారం హోంగార్డు అజయ్ కుమార్ (Ajay Kumar) ను వీధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల యొక్క ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గాని అప్రతిష్టకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేది లేదని, మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అసభ్యకర నృత్యాలు చేశారు. స్కూల్ చిన్నారులు ఎదుట శృంగార నృత్యాలు చెయ్యడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
