7800Hostels | అందుబాటులో 10వేల డార్మిట‌రీ బెడ్స్

7800Hostels | అందుబాటులో 10వేల డార్మిట‌రీ బెడ్స్

7800Hostels | గ‌దులు దొర‌క‌ని భ‌క్తుల‌కు టీటీడీ స‌దుపాయం
లాక‌ర్, వాష్ రూమ్‌, క్షౌర శాల‌లు కూడా అక్క‌డే..
ఇక చింత లేకుండా శ్రీవారిని ద‌ర్శించుకోనున్న భ‌క్తులు
వివ‌రాలు వెల్ల‌డించిన పాల‌క మండ‌లి

7800Hostels | తిరుమ‌ల‌, ఆంధ్ర‌ప్ర‌భ : తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుడికి ఇక చింత లేకుండా ద‌ర్శ‌న భాగ్యం క‌లిగించ‌డ‌మే కాకుండా వారు ఉండేదుకు టీటీడీ వ‌స‌తి సౌక‌ర్యం అందుబాటులోకి తెచ్చింది. తిరుమ‌ల‌లో స్వామి ద‌ర్శ‌నం కంటే గ‌దులు దొర‌క‌డ‌మూ గ‌గ‌న‌మే. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పాల‌క‌మండ‌లి డార్మిట‌రీ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత మెరుగు ప‌రిచింది.. తాత్కాలికంగా భ‌క్తుడు ఉండేందుకు అవ‌స‌రైమ‌న అన్ని సౌక‌ర్యాలు ఇక్క‌డ ఏర్పాటు చేసింది.. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న 7800 వ‌స‌తి గృహాల‌కు అద‌నంగా 10 వేల బెడ్స్‌తో డార్మిట‌రీల‌ను విస్త‌రించింది. దీంతో భ‌క్తుల‌కు సుమారు 30 వేల మందికి వ‌స‌తి సౌక‌ర్యం క‌లుగనుంది.

గ‌దులు ఇలా పొంద‌వ‌చ్చు
తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటర్ లో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేయాలి. అనంతరం కేటాయించిన గది నంబర్, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు అందుతాయి. భక్తులు సంబంధిత కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు. తిరుమలలో 7,800 వసతి గదులు అందుబాటులో ఉన్నందున కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఉంటుంది.

అందుబాటులో 9,336 లాకర్లు
వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు, ఇతర సౌకర్యాలను పొందవచ్చు. పీఏసీ-1 సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1,256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు. పీఏసీ-2 (మాధవ నిలయం) బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి. పీఏసీ-3 జీఎన్సీ టోల్ గేట్ నుంచి రాంభగీచా బస్ స్టాండ్కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే సదుపాయం, విశ్రాంతి సౌకర్యం కలదు. పద్మనాభ నిలయం బాలాజీ బస్ స్టాండ్ లోపల ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి, లాకర్, స్నాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పీఏసీ-5 (వేంకటాద్రి నిలయం) భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఆధునిక సముదాయంలో 16 హాళ్లు, 2,400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పణ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు అందుబాటులో 9336 ఉచిత లాకర్లు తిరుమలలోని ఈ ఐదు యాత్రికుల వసతి సముదాయాలన్నింటిలో కలిపి మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి వీటిని వినియోగించుకోవచ్చు. ఈ కేంద్రాలలో ఉచిత వేడి నీటి స్నాన గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.

CLICK HERE TO READ 65 Feet Trishul : విశ్వనగరి దిశలో.. విశాఖ Andhra Prabha News

CLICK HERE TO READ MORE

Leave a Reply