Falkon | ఆగకుండా.. ఎగురుతూ..

Falkon | ఆగకుండా.. ఎగురుతూ..

Falkon, న్యూఢిల్లీ : భారత్ నుంచి వదిలిన రెండు ఆమూర్ ఫాల్కన్లు విజయవంతంగా సొమాలియా చేరుకున్నాయి. భారత్ (Bharath) లోని మణిపూర్ నుంచి వీటిని వదలగా ఎలాంటి విరామం తీసుకోకుండా ప్రయాణించిన ఈ రెండు ఫాల్కన్లు విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని ఆగకుండా పూర్తి చేయడం విశేషం. వణ్యప్రాణి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఒక మగ, ఒక ఆడ ఫాల్కన్లను మణిపూర్ నుంచి సొమాలియాకు పంపారు. వైల్డ్ లైఫ్‌ ఇన్ స్టిస్టూట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని మణిపూర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా ట్యాగ్ చేసి పంపించారు.

మణిపూర్ అడవుల్లో ఈ పాల్కన్లకు ఉపగ్రహ ట్యాగ్ లను అమర్చడంతో 2025 నవంబర్ 11న ప్రయాణం ప్రారంభమైంది. మధ్య భారతదేశం, అరేబియా సముద్రం మీదుగా 76 గంటల పాటు ప్రయాణించి మగ ఫాల్కన్ సొమాలియాకు (Somalia) చేరుకున్న మొదటి పక్షిగా నిలిచింది. అముర్ ఫాల్కన్ పక్షుల వలసల అద్భుత విన్యాసం పట్ల తమిళనాడు అటవీ శాఖ ఉన్నతాధికారి సుప్రియా సాహు ఎక్స్ వేదికగా విస్మయం వ్యక్తం చేశారు. ఈ ట్రాకింగ్ ప్రాజెక్ట్ అముర్ ఫాల్కన్ పక్షుల అసాధారణమైన ఓర్పు నావిగేషన్ నైపుణ్యాలను తెలుసుకోవడమే కాకుండా అంతరించుపోతున్న వలస పక్షులను వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల సంరక్షణ, అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను కూడా వెల్లడిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Leave a Reply