LIBRARY | జిల్లా గ్రంథాలయంలో కవిసమ్మేళనం

LIBRARY | జిల్లా గ్రంథాలయంలో కవిసమ్మేళనం

LIBRARY | శ్రీకాకుళం,నవంబరు 17(ఆంధ్రప్రభభ): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా సోమవారం కవిసమ్మేళనం నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వివిజిఎస్ శంకరరావు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోడవరం ఈశ్వరరావు అధ్యక్షులుగా ఉంటూ కవులు మంగిపూడి శ్రీనివాసరావు, తంగి ఎర్రమ్మ, ఆర్.వి. రమణ మూర్తి, ఉమా కవి, ఇద్ది పాపయ్య, టి. లింగరాజు, రాజు, మాలతి, ఉపేంద్ర శర్మ, ఢిల్లేశ్వరరావు, విశ్వేశ్వరరావు, నీలం, దివిజసాయి భాను, తదితరులు పాల్గొన్నారు. కవిసమ్మేళనం అనంతరం గ్రంధాలయ కార్యదర్శి వివిజిఎస్ శంకరరావు కవులందరికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ పివి భాస్కర రాజా, ప్రత్యూష, కళ్యాణి, వరలక్ష్మి, రామ్మోహన్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.