Narayanpet | కేంద్ర ప్రభుత్వం విధానాలే అడ్డంకి…
Narayanpet | కేంద్ర ప్రభుత్వం విధానాలే అడ్డంకి…
Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం(42 percent for BCs) రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే అడ్డంకిగా మారుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. వెంకటరామిరెడ్డి, సీఐటీయూకు చెందిన జిల్లా కార్యదర్శి బలరాం తీవ్రంగా విమర్శించారు.
బీసీ జాగృతి సేన, బీసీ జేఏసీ(BC JAC) ఆధ్వర్యంలో నారాయణపేట మున్సిపల్ పార్కు వద్ద జరుగుతున్న న్యాయ-సామాజిక న్యాయ ధర్మదీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. వెంకటేష్ యాదవ్(G. Venkatesh Yadav), జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కూర్మయ్య నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక-సామాజిక అభివృద్ధికి 42% రిజర్వేషన్లు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం(state government) కులగణన పూర్తి చేసి రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆర్డినేషన్ను తెలంగాణ గవర్నర్కు పంపినా, బిల్లును ఆమోదించకపోవడం కేంద్ర ప్రభుత్వ ప్రభావమేనని అన్నారు. జీవో నంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా, కోర్టు మార్గం ద్వారా ఆ ప్రక్రియను అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తోందని విమర్శించారు. బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులు పిలుపునిస్తూ, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.
