Adilabad | సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

Adilabad | సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

  • రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Adilabad | జైనూర్, ఆంధ్ర‌ప్ర‌భ : రైతులు కొనుగోలు కేంద్రాల్లో త‌మ ఉత్ప్తుల‌ను విక్ర‌యంచి మ‌ద్ద‌తు ధ‌ర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kovalakshmi) అన్నారు. ఈ రోజు జైనూర్‌ మార్కెట్ గోదాంలో మార్క్ఫెడ్ నాపెడ్(Markfed Naped) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా బీన్ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సోయా కొనుగోలు కేంద్రం ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర పొందాల‌ని, రైతులు దళారుల‌ను ఆశ్రయించి మోస‌పోవ‌ద్ద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాత్ రావు(Kudi Metha Viswanath Rao) సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, అసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, సర్పంచుల సంఘం మాజీ జైనూర్ మండల అధ్యక్షులు మడావి భీమ్‌రావు, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుమ్ర భగవంతరావు, అసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, లింగాపూర్ మాజీ జెడ్పిటిసి రుక్య లఖ్యానాయక్, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply