గంజాయి అక్రమ రవాణా..

  • ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
  • 1.400 గ్రాములు స్వాధీనం

గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి చిక్కుడు రాహుల్ (కాకతీయ నగర్ గోదావరిఖని), కొప్పుల సాయి ధనుష్ (పవర్ హౌస్ కాలనీ), చిలుక వినీత్ (రాజాపురం, అంతర్గాం), మంచికట్ల అక్షయ్ (పవర్ హౌస్ కాలనీ), మాటూరి సాత్విక్ ( సప్తగిరి కాలనీ), భూక్య రాజేష్ ( రైల్వే స్టేషన్ రోడ్డు, రామగుండం) లను అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణ కు పాల్పడుతున్నాడని తెలిపారు. బల్లార్షా మహారాష్ట్ర నుండి గతంలో రెండు మూడు సార్లు గంజాయి తీసుకొచ్చి గోదావరిఖనిలో, ఇతర ప్రాంతాలలో అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బంది తో కలిసి 900 గ్రాములు డ్రై గంజాయి పట్టుకొని అతనని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతన్ని విచారించగా, అతని దగ్గర కొనుగోలు చేసిన కొప్పుల సాయి ధనుష్, చిలుక వినీత్, మంచి కట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, భూఖ్య రాజేష్ ల వివరాలు తెలిపాడు.

వారి వద్ద కూడా గంజాయి ఉందని తెలపగా, ఐదుగురు వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు గోదావరిఖని సీఐలు ఇంద్రసేనరెడ్డి, రవీందర్ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుల్స్ ప్రకాష్, రమేష్ మధుకర్, మధుసూదన్ లను సీఐలు అభినందించారు.