Telangana |కీలక నిర్ణయం

Telangana |కీలక నిర్ణయం

రామలక్ష్మణ్ కు మూడేళ్ల పదవి కాలం పొడగింపు

అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన సంఘం చైర్మన్ డాక్టర్ జె. రామ్లక్ష్మణ్(Chairman Dr.j.Ramlakshman)  పదవీ విరమణ కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకోబడింది.  డాక్టర్ జె. రామ్లక్ష్మణ్  సేవలను గుర్తిస్తూ, వారిని మరో మూడు సంవత్సరాల పాటు సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం చైర్మన్‌గా కొనసాగించాలని టీఎస్ డబ్ల్యూ ఆర్ టి యు  నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

సంఘం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని నాయకులు పేర్కొన్నారు.  పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన సంఘ నాయకులు, ఆయన నాయకత్వంలో సంఘ కార్యకలాపాలు మరింత బలపడతాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని ప్రకటించిన నాయకులలో డి. బాలస్వామి, కె. పాండు నాయక్, కీర్తి రవి, బి. వెంకటేశ్వర్లు, ఈగ శ్రీనివాస్, యు. బలిస్వారయ్య, కె. పరమేశ్వర్ (K.Parameshwar) భవాని తదితరులు ఉన్నారు.

Leave a Reply