కిడ్స్ విత్ కాకి..

కామారెడ్డి, తాడ్వాయి (ఆంధ్రప్రభ): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కిడ్స్ విత్ కాకి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఎస్పీఆర్ స్కూల్‌కు చెందిన 11 మంది విద్యార్థులకు పోలీసు స్టేషన్ పనితీరు, కేసుల పరిష్కార విధానం, ప్రజలతో పోలీసుల సంబంధాలు, స్టేషన్‌లో జరిగే వివిధ కార్యకలాపాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కొండల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
