Telangana | ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

Telangana | ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

భువనగిరి ఆర్ డి ఓ ఎం కృష్ణారెడ్డి


Telangana | మోత్కూర్, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకాలు వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ డి ఓ ఎం కృష్ణారెడ్డి ( RDO M Krishna Reddy) అన్నారు. శుక్రవారం మోత్కూర్ మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఐ కె పి (ఇందిరా క్రాంతి పథకం) లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్ డి ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తేమ శాతం కలిగిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని,రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్ (Tahsildar) జ్యోతి ని ఆదేశించారు. ఏరోజుకారోజు కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించాలన్నారు. వర్షాలు తగ్గి, ఎండలు కొడుతున్న నేపథ్యంలో రైతులు ఆరబెట్టిన, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని, దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.

ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో ధాన్యం డబ్బులు తమ అకౌంట్ లో జమ అవుతాయన్నారు.ఈ సందర్భంగా వీరి వెంట తహశీల్దార్ జ్యోతి, ఆర్ ఐ సుమన్, ఐ కె పి వి బి కె బండి మానస, రైతులు (farmers) తదితరులు ఉన్నారు.

Leave a Reply