Bus | తప్పిన పెను ప్రమాదం

Bus | తప్పిన పెను ప్రమాదం


గుడివాడ, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గుడివాడ (Gudivada) లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగవరప్పాడు సెంటర్లో ఆర్టీసీ బస్సు (RTC bus), ఆటోను, కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో, ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఏలూరు నుండి మచిలీపట్నం వెళుతున్న బస్సును వేగంగా వచ్చి కారు (car) ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుడివాడ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

Leave a Reply