విద్యావ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్

విద్యావ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్

జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: భారతదేశ విద్యావ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి (T. Rahul Kumar Reddy) అన్నారు. మంగళవారం జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 జయంతి కార్యక్రమంను జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని మౌలానా అబుల్ కలం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… భారత స్వాతంత్ర సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రి అని, దేశంలో విద్యరంగం అభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Abul Kalam Azad) ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులుతో పాటు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్య పాత్ర పోషించారన్నారు. మైనార్టీ వర్గము నుండి వచ్చినప్పటికీ ఒక్క మైనార్టీల కొరకు కాకుండా దేశం మొత్తానికి పాటుపడిన వ్యక్తులలో వీరు ఒకరు అన్నారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గ్రహించి చదువుకుంటే ఎటువంటి ఇబ్బందులు నైనా అధిగమించవచ్చునని సంకల్పంతో బాగా చదువుకుని జర్నలిజం చేసి ముస్లిం, హిందూ అభివృద్ధికి పాటు పడ్డారని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్య శాఖ మంత్రి (First Education Minister) గా ఆయన పనిచేసి చదువుకు వున్న ప్రాముఖ్యతను తెలిపిన ఏకైక వ్యక్తి అన్నారు. ఆయన బాగా చదువుకుని దేశానికి, సమాజానికి మంచి సేవ చేసారన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత బాగా చదువుకుని ఎటువంటి సమస్యనైనా అధిగమించి అభివృద్ధి సాధించాలన్నారు. అలాగే తోటి వారికి సహాయపడుతూ సమాజానికి ఎంతో కొంత సేవ చేసి మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సి ఎస్ ఆర్ నిధులు, బరియల్ గ్రౌండ్ సమస్యను సభ దృష్టికి తేగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

అనంతరం ఉర్దూ భాషలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు షీల్డ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ (Joint Collector) చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హెచ్ వి ఎస్ మూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఏపీ ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ మెంబర్ ఎండి షబీనాబేగం, స్టేట్ మైనార్టీ సెక్రటరీ ఎండి జాకీర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply