బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా?

బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా?
- బ్రిడ్జి పూర్తి అయితే రెండు జిల్లాల మధ్య తగ్గనున్న దూరం
- వానకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- ఏళ్లు గడిచినా పిల్లర్ల వరకేనా
- దిష్టిబొమ్మల తలపిస్తున్న బ్రిడ్జి
టేకుమట్ల, ఆంధ్రప్రభ : నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు… పడేలా చేస్తున్న కార్యక్రమాలతో జనం విసుకుపోతున్నారు. ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలకు రవాణా సౌకర్యం కల్పించేలా దూరభారం తగ్గేలా చేపట్టిన వంతెన నిర్మాణానికి(construction bridge) నిర్లక్ష్యపు గ్రహణం పట్టుకుంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ఏడేళ్లు గడుస్తున్నా పిల్లర్ల దశ దాటడంలేదు. వంతెనతో మూడు జిల్లాలకు దూరభారం తగ్గుతుందనుకున్న ప్రజల ఆశలు నెరవేరడం లేదు.
పాలకుల నిర్లక్ష్యంతోనే కాంట్రక్టర్లు వంతెన నిర్మాణం పనులను జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపలల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ముత్తారం మండలం ఓడేడు గ్రామాల వద్ద మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.47.7 కోట్లు మంజూరు కాగా.. 2016 ఆగస్టు 4న తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి ఆర్ అండ్ బి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) శంకుస్థాపన చేశారు.
అయితే ఇప్పటివరకు వంతెన పనులు పూర్తికాకపోవడంతో రెండు జిల్లాలైన ఉమ్మడి వరంగల్ పరకాల చిట్యాల టేకుమట్ల గోదావరిఖని జమ్మికుంట మొగుళ్లపల్లి మందమర్రి బెల్లంపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు వాగు పారే సమయంలో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఏడేళ్లు గడిచినా పిల్లర్లలోనే..
గర్మిళ్లపల్లిఓడెడ్ మానేరు వంతెన నిర్మాణం చేపట్టి ఏడేళ్లు గడిచాయి. అయినా పనులు మాత్రం పిల్లర్లను దాటలేదు. వంతెన నిర్మాణాన్ని దక్కించుకున్న కాంట్రాక్టర్(Construction) గడువు పొడిగించుకున్నా.. జాప్యమవుతోంది. ఏడేళ్లలో కనీసం 60శాతం పనులు కూడా పూర్తికాకపోవడానికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్ల దశకే ఏడేళ్లు పడితే పనులు పూర్తికావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
80 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది..
వంతెన నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లా(Joint Warangal District)కు వెళ్లడానికి సుమారు 50 నుంచి 80 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. మంథని నియోజకవర్గంలో పండించే పత్తి, మిరప రైతులు వరంగల్ మార్కెట్కు వెళ్లడానికి ఈ మార్గం అనుకూలం. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు సింగరేణి కార్మికులు, రైతులు, వ్యాపారుల రాకపోకలకు ఈ వంతెన దూరభారం తగ్గిస్తుంది.
ఓడెడ్ గ్రామానికి చెందిన రైతుల భూములు, తాటివనం మానేరు అవతల ఉన్నాయి. వర్షకాలంలో మానేరు ఉధృతంగా ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. అత్యవసరమైన వారు సుమారు 80 కిలోమీటర్లు(80 Kms.) ప్రయాణించాల్సి ఉంటుంది. గీతకార్మికులు ప్రాణాలు క్యాన్ల సాయంతో ఈదుతూ మానేరు దాటుతారు. గతంలో వాగు దాటుతూ మనుషులు పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి వంతెన నిర్మాణం పూర్తయితే వీరందరికీ మేలు జరుగుతుంది.
నిర్మాణం పూర్తిచేయాలి(దాసరపు మొగిలి)..

గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన నిర్మాణ పనులు ఐదున్నరేళ్లుగా సాగుతున్నాయి. దీంతో వాగు దాటలేక ఇబ్బందులు పడుతున్నాం. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడుకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వర్షాకాలంలో అక్కడికి వెళ్లేందుకు సుమారు 30 కి. మీ. అదనంగా ప్రయాణించి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్(Srirampur) మండలం మీదుగా వెళ్లాల్సి వస్తోంది.
బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్నాం (పంజా నర్సింగం)..

బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇటీవల చిట్యాల మండలం, అందువల్ల తండా గ్రామానికి చెందిన వ్యక్తి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు(By Accident) అందులో పడి మృతి చెందాడు ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాగా ఇప్పటికైనా నాయకులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నాం
