రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి
దండేపల్లి, ఆంధ్రప్రభ : నల్గొండ (Nalgonda) లో ఈ నెల 14నుండి16 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ బాలబాలికల పోటీల్లో దండేపల్లి మండలంలోని తాళ్ళపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న మారినేని అంజలి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరంగి సుదర్శన్, ఫిజికల్ డైరెక్టర్ రోజి వరకుమారి తెలిపారు.ఈ పోటీల్లో విద్యార్థిని ఎంపిక కావడంతో ఎస్ జి ఎఫ్ సెక్రటరీ యాకుబ్ విద్యార్థిని అభినందించారు.
