శివయ్య ఆశీస్సులు ఉండాలి..

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : శివుని ఆశీస్సులుంటే ఏదైనా సాధ్యమవుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం భగీరథపల్లి గ్రామంలో ప్రముఖ వ్యాపారి పల్లెర్ల అశోక్ కుటుంబ సభ్యులు నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివునికి ప్రత్యేక పూజలు చేయాలని చెప్పారు. ఈ పవిత్ర మాసంలో శివుని పూజిస్తే అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని చెప్పారు. ప్రతి కుటుంబానికి శివుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో శివాలయం నిర్మించడం అభినందనీయమన్నారు. శివాలయాన్ని నిర్మించిన అశోక్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
