కోటగుళ్ళ సందర్శన కొత్త అనుభూతి…

-కోటగుళ్లను సందర్శించిన ఐఏఎస్ శిక్షణ బృందం

గణపురం, ఆంధ్రప్రభ : కాకతీయులు నిర్మించిన కోటగుళ్ళ సందర్శన(A visit to the forts) కొత్త అనుభూతిని మిగిల్చిందని శిక్షణ ఐఏఎస్ ల బృందం(IAS team) తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు 12మంది ఐఏఎస్ శిక్షణ బృందం అనురాగ్ రంజన్, వటాస్ రాజ్, కృష్ణ ఝా, విపశయన తన్వర్, కృష్ణ సి, విశేష్ సింగ్, తుషార్ సింగ్, ఆదిత్య సింగ్, మయాంక్ ఖండేల్వాల్, మణిమాల, ఎన్వి.శాల్ సింగ్, పవార్ అక్షయ్ విలాస్, రితికా రాత్ లు కోటగుళ్లను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు(Nagaraju) వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వారు ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ చరిత్రను తెలుసుకొని వారు ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. కోటగుళ్ల(Kotagulla)ను సందర్శించడం, ఇక్కడి ఆలయాల నమూనా తమను ఎంతో ఆకట్టుకుందని, రాతి కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు.

సుమారు గంటపాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపి ఫోటోలు, వీడియోలు(photos, videos) చిత్రీకరించుకున్నారు. వారి వెంట గణపురం ఎస్ఐ రేఖ అశోక్, మహా ముత్తారం డీటీ సందీప్, గణపురం ఆర్ఐ చెక్క దేవేందర్, గుడాల తిరుపతి, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply