అనారోగ్య సమస్యలతో..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
పురుగుల మందు తాగిన వృద్ధురాలు
చికిత్స పొందుతూ మృతి
నాగిరెడ్డిపేట్ నవంబర్ ఆంధ్రప్రభ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాం గ్రామానికి చెందిన రొడ్డ రత్నవ్వ (70) వయసు భారం తో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. శనివారంనాడు ఇంటి వారందరు పొలం దగ్గరకు వెళ్లారని సాయంత్రం ఇళ్లకు వచ్చారు. అంతకుముందే ఇదే అదనుగా భావించిన వృద్ధురాలు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి పెట్ లోని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందారని తెలిపారు. మృతురాలి కూతురు సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
