అర్చకులకు రాజభోగం.. భక్తులకు నరకం

అర్చకులకు రాజభోగం.. భక్తులకు నరకం
నిజామాబాద్, భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్ట (Limbadri Gutta) మీద సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉత్సవాలలో భాగంగా భక్తులు కొందరు క్షేత్రంలో నిద్ర చేసేందుకు మొక్కులు మొక్కు కుంటారు. అందులో భాగంగా భక్తులు కొందరు ఐదు, మూడు, ఒక్క రోజు వీలును బట్టి క్షేత్రంలో బస చేస్తారు. కాlw అలాంటి సామాన్య భక్తులు క్షేత్రంలో నిద్రించేందుకు ఎలాంటి వసతులు లేవు.
భక్తులు (devotees) కొండపై ఎక్కడ పడితే అక్కడే అరుబయట నిద్రకు ఉపక్రమిస్తారు. స్వామి మీద ఉన్న భక్తితో భక్తులు ఏండ్ల సంధి సౌకర్యాలు లేకున్నా ఇలానే నెట్టుకుంటూ వస్తున్నారు. ఏటా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పుకుంటూ వస్తున్న ఆలయ ధర్మకర్తల పేరిట ఉన్న అర్చకులు సమస్యలు పరిష్కరించకుండా, దాటవేసుకుంటూ వస్తున్నారు.
అర్చకులకు రాజభోగం.. సామాన్యులకు నరకం…
ఉత్సవాల్లో నిద్ర చేసేందుకు వచ్చిన మహిళ అర్ధరాత్రి మూత్ర విసర్జన కు లేచింది. మూత్ర విసర్జన కు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు (No facilities). మూత్ర విసర్జన కు వెళ్ళాలి అంటే అడవిలోకి, గుట్టల చాటుకు వెళ్లాల్సిందే. ఆ సమయం లో ఏదైనా జరిగితే బాద్యులు ఎవరు . ఇది ఒక మహిళ పరిస్థితి అనుకుంటే పొరపాటు భక్తులందరికి జరుగుతున్న పరిస్థితి. చెప్పుకోలేని దుస్తుతి ఉంది. కాని ఏటా ఉత్సవాలకు వచ్చే బ్రాహ్మణ (అర్చక) కుటుంబాల వారికి మాత్రం క్షేత్రం పైన ఉండేందుకు బస, బాత్ రూం లు, వంట గదులు ఏర్పాటు చేసుకున్నారు.

సామాన్య భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఏండ్ల సంధి ఇబ్బంది చేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే చేస్తామని చెబుతున్న అర్చకులు కేవలం నగదు విరాళాలపై చూపిస్తున్న ప్రేమ సౌకర్యాలు కల్పించడం లో చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అర్చకుల కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడం లో చూపిస్తున్న శ్రద్ద సామాన్యుల విషయం లో ఎందుకు చూపడం లేదనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
