డిసెంబర్ లో ఛలో ఢిల్లీ ప్రోగ్రాం
పార్లమెంట్ దిగ్బంధం
వేలాదిమంది తల్లి రావాలని పిలుపునిచ్చిన జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ, నవంబర్ 6(ఆంధ్ర ప్రభ): బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు సాధించడానికి కార్యచరణ రూపొందించి డిసెంబర్ మొదటి వారంలో ఛలో ఢిల్లీ ప్రోగ్రాంతో పార్లమెంట్ దిగ్బంధం చేయడం జరుగుతుందని బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) అన్నారు.
రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో పూలే విగ్రహం వద్ద మౌనదీక్ష (Silence) చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీ రాజ్యాధికారం సాధించేంత వరకు కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు (BC JAC leaders) చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, సొల్లేటి ప్రభాకర్, తండు సైదులు గౌడ్, కాసోజ్ విశ్వనాథం, పన్నాల గోపాల్ రెడ్డి, నకెరెకంటి కాశయ్య గౌడ్, నేలపట్ల సత్యనారాయణ, లోకరబోయిన రమణ ముదిరాజ్, బగరం శ్రీనివాస్ చిలక రాజు చెన్నయ్య, నల్ల మధు యాదవ్, కట్టెకోల్ దీపెంధర్, తదితరులు పాల్గొన్నారు.


