తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలియచేసింది. ఏపీలో 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని, దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో తెలియచేశారు.

కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే.. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావారణ శాఖ తెలియచేసింది. వర్షాలు పడే టైమ్ లో ప్రజలు బయటకు వెళ్లద్దని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

Leave a Reply