ఘనంగా జాతీయ ఎక్తా దివస్
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 31 (ఆంధ్రప్రభ) : సువిశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమని నంద్యాల ఎస్పీ సునీల్ సునీల్ షేరాన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షేరాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ జిల్లా పోలీసులు నంద్యాల పట్టణ కేంద్రంలోని సుమారు 250 మంది విద్యార్థులతో పోలీసు అధికారులు, సిబ్బందితో ఐక్యతా పరుగు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారన్నారు. అనంతరం ఐక్యత పరుగును జెండా ప్రారంభించారు.ఈ ఐక్యత గ్రౌండ్ నుంచి వై.జంక్షన్, మున్సిపల్ ఆఫీసు, పద్మావతినగర్, టెక్కేమీదుగా మార్కడ్ యార్డ్ వరకు కొనసాగిందన్నారు. ఈ యూనిటీ రన్ లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు మార్కెట్ యార్డ్ లో సబ్ డివిజన్ ఏ ఎస్పీ ఎం.జావళి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి , ఏ ఆర్ డీస్పీ శ్రీనివాసరావు , కంబగిరి రాముడు, ఈశ్వరయ్య అస్రర్ భాష , ఆర్ ఐ లు మంజునాథ్ , సురేష్ బాబు పాల్గొన్నారు.

