అప్రమత్తంగా ఉండాలి..

అప్రమత్తంగా ఉండాలి..
బీబీనగర్, అక్టోబర్ 29(ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri ) జిల్లాలో రుద్రవెల్లి – జూలురూ మూసీ వంతెన పై మూసి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు బుధవారం బారికేడ్ లు ఏర్పాటు చేసి రాకపోకలు బంద్ చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుంది. అందుచేత అటు వైపు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
