ఔటర్ పై ప్రమాదం..

హైదరాబాద్‌లో ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో హిమాయత్ సాగర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా ఏడు ప్రైవేట్ కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

రాజేంద్రనగర్ నుంచి అప్పా (APPA) వైపు వెళ్తున్న మొదటి కారు.. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆరు కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి.

ప్రమాదం కారణంగా కార్లు రోడ్డుపై ఆగిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.