న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో…

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం మొదట శివార్లలో మొదలైన వర్షం, తర్వాత నగరంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.

మొదట సూరారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, బాచుపల్లి, కొంపల్లిలో మొదలైన వ‌ర్షం.. క్రమంగా నగరంలోని కోఠి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ వంటి ప్రధాన ప్రాంతాలను ముంచెత్తింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేటతో పాటు ఉప్పల్, నాగోలు, హయాత్‌నగర్ వరకు వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలమయం అయ్యి, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఉప్పల్, నాగోలు, హయత్‌నగర్‌లలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇక‌ రాబోయే గంటల్లో రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Leave a Reply