డీఎస్పీ నళిని సంచలన లేఖ

డీఎస్పీ నళిని సంచలన లేఖ
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా(resignation) చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. ఇది నా మరణ వాంగ్మూలం(testimony) అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా ఆందోళనకరంగా ఉందని, రుమటాయిడ్ ఆర్థరైటిస్తోతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
నా జీవితం ముగియబోతోంది!
” ఒక అధికారిణి గా.. ఉద్యమకారిణిగా.. రాజకీయవేత్తగా.. ఆయుర్వేద ఆరోగ్య సేవికగా(Ayurveda as a health practitioner).. ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్(serious)గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. మూడు రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్నిజపిస్తూ గడుపుతున్నాను. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తు బుట్టదాఖలైంది.
ఇప్పటి వరకు నన్నుఏ నాయకుడూ సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ(Political) లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. ప్రధాని మోదీని(Prime Minister Modi) కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తా.” అని నళిని తన లేఖలో పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల కిందట..
ఎనిమిదేళ్ల కిందట సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు( Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేక పోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు, మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్నునేను బాగుచేసుకున్నాను.
కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బులేదు. 25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌కు సెన్సిటివ్‌గా మారిపోయింది. నేను ఫార్మసిస్టు(Pharmacist)ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే(Ayurveda) వాడుతూ, యోగ, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను.
కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి” అని ఆమె పేర్కొన్నారు.
“నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం(Padma Vyuham) లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్నికసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే ,12 ఏళ్ల అజ్ఞాతవాసాన్నిఅనుభవించాను. మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్నికనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ, యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని, నా దారిని రహదారిగా, పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది.” లేఖలో పేర్కొన్నారు.
” ఇలాంటి తరుణంలో నేటి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్(Suspension) పై విచారణ చేయించి ఇన్నేండ్లు ఇవ్వకుండా సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క కట్టి(సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్టును ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్(Grant) కూడా ఇమ్మని అడిగాను. ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు” ఆవేదన వ్యక్తం చేశారు.
“ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరితే, నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే.. ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని, 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిభిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్నిబోధించి వారిని ధర్మపరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఉంది. ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.
నా పేరు పై ఉన్నఒక్కగానొక్క ఇంటి స్థలం వివైపీఎస్కు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేక పోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్(Vedamrutham Trust) కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను.” అని లేఖలో పేర్కొన్నారు.



