చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్

చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్
- ఏ ఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీ చలో మెడికల్ కాలేజీ(Medical College) ఆందోళనకు అనుమతి లేదని, నంద్యాల సబ్ డివిజన్‌లో 30 పోలీస్ యాక్ట్(Police Act) అమలులో ఉందని ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు లేవని నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్(Manda Javali Alphons) గురువారం తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఆందోళన జరుపుతామని వైసీపీ(YCP) ప్రకటించింది. ఈ ఆందోళనకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ(Congress Party) విద్యార్థి, యువజన విభాగాలతో కలిసి “ఛలో మెడికల్ కాలేజీ” పేరుతో నంద్యాల జిల్లాలోని మెడికల్ కాలేజీ దగ్గరకు ర్యాలీగా వెళ్లి, అక్కడి వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని భావించాయి.
ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా పోలీసులు(Police) ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని ఏ ఎస్పీ తెలిపారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్(Second Year) మెడికోల పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ పరీక్షలు ఈనెల 30 వరకు కొనసాగనున్నాయన్నారు. ఈ సందర్భంలో, వైఎస్సార్సీపీ(YSRCP) నాయకులు నంద్యాల మెడికల్ కాలేజీలో ఆందోళన పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఎఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.అందువల్ల, రేపు 19 వ తేదీన నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద ఏ విధమైన సమావేశాలకు అనుమతి ఇవ్వలేదన్నారు.
