IND vs AUS | మరో రెండు రోజుల్లో మహిళల పోరు..
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు వన్డే పోరు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుండగా.. సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ పర్యటనకు రానుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతుండగా, అలిస్సా హీలీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఆడనుంది. ఇరు జట్లు బలమైన స్క్వాడ్లను ప్రకటించాయి.
మొదటి రెండు వన్డేలు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతాయి. మూడో వన్డే మాత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. దీంతో రాబోయే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్ ఇరుజట్లకూ కీలకంగా మారింది.
మొదటి వన్డే సెప్టెంబర్ 14న, రెండోది 17న, చివరి వన్డే 20న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జియో హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్)
ఆస్ట్రేలియా జట్టు
అలిస్సా హీలీ (కెప్టెన్), నికోల్ ఫాల్టమ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, జార్జియా వోల్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, చార్లీ నాట్, ఎల్లీస్ పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్, డార్సీ బ్రౌన్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, జార్జియా వేర్హామ్.
