Snap | త‌న‌యుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యూట్ స్నాప్ ..

మంగ‌ళ‌గిరి – ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (ap deputy cm pawan kalyan) నేడు ఫోటో వైరల్ గా మారింది. తన ఇద్దరు కుమారులు అకిరా నందన్ (akira nandan ) , మార్క్ శంకర్ పవనోవిచ్ (mark sankar pawanowitch ) లతో ఉన్న ఫోటో ఆయన అభిమానులను, జనసేన (Janasena ) శ్రేణులను ఆకట్టుకుంది. ఈరోజు ఉద‌యం మంగ‌ళ‌గిరిలోని త‌న నివాసంకి చేరుకోగా . ఆయ‌న‌తో పాటు త‌న పెద్ద కుమారుడు అకీరా నందన్ , చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఉన్నారు. ఈ తండ్రి త‌న‌యులు క్యాప్ష‌న్ తో ఈ ఫోటో షేర్ చేయ‌డంతో అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు.. అనంత‌రం ప‌వ‌న్ ఇంటి నుంచి మార్కాపురం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. అక్కడ జలజీవన్ మిషన్ కింద రూ. 1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.