TG | నేడు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌ (Intermediate ) అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను (Exam results ) సోమవారం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు tgbie.cgg.gov.in, results cgg.gov.in వెబ్‌సైట్లలో మార్కుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి టీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌

టీజీఈసెట్‌ (TG ECet) మొదటి విడత కౌన్సెలింగ్‌ను(Counciling ) ఈ నెల 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 14లోగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేపట్టనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని టీజీఈసెట్‌-25 కన్వీనర్‌ వెల్లడించారు. అర్హత ఆధారంగా ఈ నెల 25లోగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply