గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..
ఉరవకొండ రూరల్, ఆగస్టు 17 (ఆంధ్రప్రభ): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని అమిద్యాల రోడ్డులో కోడిగుట్ట చేనులో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి చిగురు చెట్టుకు తెల్లని వస్త్రంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతుడు ఆకుపచ్చ రంగు టీషర్ట్, జీన్స్ ప్యాంట్, చెప్పులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి పక్కన ఒక బ్యాగ్ లభించింది. అందులో పెన్‌డ్రైవ్, ఛార్జర్, కత్తెర, కళ్లద్దాలు, తెల్లటి షర్ట్, బ్లూ చెక్స్ ఉన్న షర్ట్ ఉన్నాయి. మృతుడి జేబులో ఆగస్టు 15న గుంతకల్లు నుంచి ఉరవకొండకు, ఉరవకొండ నుంచి పెన్నహోబిలంకు ప్రయాణించిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్లు లభించాయి. మృతుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా, పై ఆనవాళ్ల ఆధారంగా గుర్తించగలిగినా వెంటనే ఉరవకొండ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఉరవకొండ సిఐ మహానంది సెల్ నెంబర్ 9490108514, ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు సెల్ నెంబర్ 9440740876లకు సమాచారమివ్వాలన్నారు.
