ప్రజావాణిలో తొలి దరఖాస్తు
వెలిశాల భూ సమస్యపై అధికారులకు ఫిర్యాదు
తిరుమలగిరి, ఆంధ్రప్రభ: మండల స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం తిరుమలగిరి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిశాల గ్రామానికి సంబంధించిన భూ సమస్యపై తొలి దరఖాస్తు అధికారులకు అందింది. సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారు కోరారు.
ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
