కాచాపూర్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
నాగదేవత ఆలయాల్లో మహిళల ప్రత్యేక పూజలు
బిక్కనూర్, ఆంధ్రప్రభ: బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నాగదేవత ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. నాగుల పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని నాగదేవతను వేడుకున్నారు.
అనంతరం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న నాగుల పుట్ట వద్ద గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నాగదేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు.
