శాంతిభద్రతలకు విభూతం కలిగేస్తే ఉపేక్షం..
నందిగామ రూరల్, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండానిర్వహించేందుకు టౌన్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, గతంలో వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు నందిగామ టౌన్ సీఐ P. శ్రీను తెలిపారు.
ఈ సందర్భంగా నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షీట్ హోల్డర్స్‌ను ఉద్దేశించి సీఐ P. శ్రీను మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలు, బెదిరింపులు, దాడులు, గుంపులుగా చేరి అశాంతికి కారణమయ్యే చర్యలు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత విభేదాలను ఎన్నికల సమయంలో గొడవలుగా మార్చుకోవద్దని సూచించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలి. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదుఅని సీఐ P. శ్రీను పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నందిగామ టౌన్ ఎస్సైలు సూర్య వంశీ , మహతి, నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
