తిమ్మాపూర్‌లో త్రైత సిద్ధాంత గ్రంథాల ప్రచారం
- ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం త్రైత సిద్ధాంత గ్రంథాల ప్రచారం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందుజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో త్రైత హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రబోధ సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ.. పూర్వకాలంలో శ్రీకృష్ణాష్టమిని 11 రోజుల పాటు నిర్వహించేవారని తెలిపారు. చివరగా చవితి రోజున శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించి వేడుకలను ముగించేవారని పేర్కొన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఊరేగింపు నిర్వహించిన గ్రామాల్లో ప్రకృతి వైపరీత్యాలు, రోగ బాధలు ప్రజలకు ఉండవని వారు పేర్కొన్నారు. దేవుడే అవతరించి ఒక మనిషిగా జన్మిస్తే భగవంతుడు అని అంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట, కొడిమ్యాల కమిటీల సభ్యులు ఆర్. రాజు, రాజు, రవి, సునీత, నాగిరెడ్డి, నాగమణి, ఎం. రాజు, రవళి, అతిథియ, రావణ్ తదితరులు పాల్గొన్నారు.
