పచ్చని పంట పొలంలో బీజేపీ జెండా.. ఆకట్టుకుంటున్న దృశ్యం
రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా పలువురు రైతులు, ప్రయాణికులను ఆకర్షించింది. రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్వు కుమారస్వామికి చెందిన వ్యవసాయ భూమిలో బీజేపీ జెండాను ఏర్పాటు చేశారు. పచ్చని పంట పొలంలో బీజేపీ జెండా కనిపించడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, రైతులు ఆసక్తిగా గమనించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు పంట పొలంలో జెండాను ఏర్పాటు చేసినట్లు బీజేపీ మండల ఉపాధ్యక్షుడు, రైతు సర్వు కుమారస్వామి తెలిపారు. పచ్చని పంట పొలంలో బీజేపీ జెండా ఏర్పాటు చేయడంతో పలువురు ఆయన అభిమానాన్ని చూసి ఆకర్షితులయ్యారు.
